క‌ళా'మా' త‌ల్లి: చిరంజీవి రాజీనామాను ఆమోదించారా?

Garikapati Rajesh

మా అధ్య‌క్షుడిగా ఎవ‌రు ఎన్నికైనా ముందుగా ప్ర‌మాణ స్వీకారం చేసి ఆ త‌ర్వాత ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టేవారు. ఇది 2015 నుంచి జ‌రుగుతూ వ‌స్తోంది. కానీ దానికి భిన్నంగా మంచు విష్ణు ముందుగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. రేపు ప్ర‌మాణ స్వీకారం చేస్తున్నారు. క్ర‌మ‌శిక్ష‌ణ సంఘం చైర్మ‌న్‌గా కృష్ణంరాజు ఉన్నారు. చిరంజీవి, ముర‌ళీమోహ‌న్‌, మోహ‌న్‌బాబు, జ‌య‌సుధ అందులో స‌భ్యులుగా ఉన్నారు. ఏడాది క్రితం చిరంజీవి త‌న ప‌ద‌వికి రాజీనామా స‌మ‌ర్పించారు. అయితే ఆ రాజీనామాను ఇంత‌వ‌ర‌కు ఆమోదించ‌లేదు. త‌ర్వాత కొత్త‌గా వ‌చ్చే మా కార్య‌వ‌ర్గం కూడా ఆమోదించ‌కుండా ఉంటే ఆయ‌న ప‌ద‌విలో కొన‌సాగుతున్న‌ట్లుగానే అవుతుంది. ఇప్పుడు విష్ణు కార్య‌వ‌ర్గం చిరంజీవి రాజీనామాను ఆమోదిస్తారా?  లేదా? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా మారింది. ఇప్ప‌టికే ప్ర‌కాష్ రాజ్ ప్యానెల్ స‌భ్యులు రాజీనామాలు స‌మ‌ర్పించారు. దానివెన‌క చిరంజీవి ఉన్నారని వ్యాఖ్య‌లు విన‌వ‌స్తున్నాయి. అటువంటిది చిరంజీవి క్ర‌మ‌శిక్ష‌న సంఘం స‌మావేశం జ‌రిగే హాజ‌ర‌వుతారా?  లేదా? అనేది క‌ష్టంగా మారింది. ఏదేమైన‌ప్ప‌టికీ రేప‌టి ప్ర‌మాణ స్వీకారం త‌ర్వాతే ఈ విష‌యంపై ఒక స్ప‌ష్ట‌త రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

maa

సంబంధిత వార్తలు: