రాష్ట్రప‌తి రామ్‌నాథ్ కోవింద్ సంచ‌ల‌న నిర్ణ‌యం...!

N ANJANEYULU

సాంప్ర‌దాయానికి భిన్నంగా రాష్ట్రప‌తి రామ్‌నాథ్ కోవింద్ ద‌స‌రా వేడుక‌ల‌కు స‌న్న‌ద్ధమ‌య్యారు. ఈ సంవ‌త్స‌రం విజ‌య‌ద‌శ‌మి వేడుక‌ల‌ను భార‌త జ‌వాన్ల‌తో క‌లిసి నిర్వ‌హించుకోవాల‌ని నిశ్చ‌యించుకున్నాడు. దేశ స‌రిహ‌ద్దు ప్రాంత‌మైన ల‌ద్దాఖ్‌లోని ద్రాస్‌లో ద‌స‌రా వేడుక‌లు జ‌రుపుకుంటారు. రాష్ట్రప‌తి రేపు, ఎల్లుండి జ‌మ్మూకాశ్మీర్‌, ల‌ద్దాఖ్‌ల‌లో ప‌ర్య‌టించ‌నున్నారు.  ఈ విష‌యాన్ని రాష్ట్రప‌తి భ‌వ‌న్ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

 
రాష్ట్రప‌తి గురువారం లేహ్‌లోని సింధు ఘాట్ వ‌ద్ద సింధు ద‌ర్శ‌న్ పూజ‌లో పాల్గొని సాయంత్రం జ‌మ్మూకాశ్మీర్‌కు వెళ్తాడు. జ‌మ్మూలోని ఉధంపూర్ బ‌ల‌గాల‌తో క‌లిసి ద‌స‌రా వేడుక‌ల్లో పాల్గొంటారు. ఈనెల 15 న కార్గిల్ యుద్ధ స్మార‌కం వ‌ద్ద అమ‌ర‌జ‌వాన్ల‌కు నివాళుల‌ర్పించ‌నున్నారు. అనంత‌రం ద‌స‌రా ఉత్స‌వాలు నిర్వ‌హించుకుంటారు.  
మ‌రోవైపు దేశ ప్ర‌జ‌ల‌కు రాష్ట్రప‌తి ద‌స‌రా పండుగ శుభాకాంక్ష‌లు తెలిపారు. దుర్గాదేవి అన్యాయాన్ని అణ‌చివేయ‌డానిక‌కి స్త్రీ శ‌క్తి యొక్క దైవిక రూపానికి చిహ్నం.  దేశ నిర్మాణంలో మ‌హిళ‌ల‌కు మ‌రింత గౌర‌వం.. స‌మాన భాగ‌స్వామ్యం ఉండే స‌మాజాన్ని నిర్మించ‌డానికి మ‌నంద‌రం సంక‌ల్పం చేద్దాం అని రాష్ట్రప‌తి ట్వీట్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: