MAA: తెర‌వెన‌క రాజ‌కీయం న‌డించిందిగా..?

Garikapati Rajesh

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ ఎన్నిక‌లు ముగిశాయి. విష్ణు గెలిచాడు. ప్ర‌కాష్ రాజ్ రాజీనామా స‌మ‌ర్పించారు. అంత‌వ‌ర‌కు బాగానే ఉంది. ఆ త‌ర్వాతే తెర‌వెన‌క చ‌క‌చ‌కా పావులు క‌దిలాయి. రాజ‌కీయం బాగా చేశారు. నాగ‌బాబు రాజీనామా స‌మ‌ర్పించారు. ఆ త‌ర్వాత ప్ర‌కాష్ రాజ్ రాజీనామా స‌మ‌ర్పించారు. ఆ త‌ర్వాత శివాజీరాజా న‌రేష్ పై చ‌ర్య‌లు తీసుకోక‌పోతే రాజీనామా చేస్తాన‌ని హెచ్చ‌రించారు. ఆ త‌ర్వాత ప్ర‌కాష్ రాజ్ ప్యానెల్ త‌ర‌ఫున గెలిచిన 11 మంది స‌భ్యులు రాజీనామాలు స‌మ‌ర్పించారు. విష్ణు ప‌నుల‌కు తాము అడ్డురాకూడ‌ద‌ని, పెద్ద పెద్ద హామీలిచ్చారు కాబ‌ట్టి ఆయ‌న చేస్తార‌న్నారు. తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో చిరంజీవి కంటూ ఒక వ‌ర్గం ఉంద‌ని, వారంతా చిరంజీవి ఎటుచెబితే అటు ఓటు వ‌స్తార‌నే ప్ర‌చారం ఉంది. అంద‌రూ అది నిజ‌మే అనుకున్నారు. అయితే మోహ‌న్‌బాబు రంగంలోకి దిగి వ్యూహ‌చ‌తుర‌త‌తో ఓటుహ‌క్కు వినియోగించుకోనివారంద‌రినీ హైద‌రాబాద్‌కు ర‌ప్పించి ఓటు వేయించారు. 200కు పైగా ఓట్లు ఎక్కువ‌గా గ‌త ఎన్నిక‌ల‌తో పోలిస్తే పోల‌య్యాయి. విష్ణు విజేత‌గా నిలిచాడు. చిరంజీవి వ‌ర్గం కుదేలైపోయింది. అవ‌మాన‌క‌రంగా భావించింది. మ‌రో అసోసియేష‌న్ ఏర్పాటుకు తెర‌లేపారు. అంతా తెర‌వెన‌క రాజ‌కీయ‌మే. తెర‌ముందే కాదు.. తెర‌వెన‌క కూడా బాగా న‌టిస్తామంటున్నారు మ‌న తెలుగు న‌టులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

maa

సంబంధిత వార్తలు: