కొత్త అసోసియేష‌న్ ఆలోచ‌న లేదు : ప్ర‌కాశ్‌రాజ్‌

N ANJANEYULU
మా ఎన్నిక‌ల్లో మంచు విష్ణు చేతిలో ఓట‌మి పాలైన ప్ర‌కాశ్‌రాజ్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. మూకుమ్మ‌డిగా రాజీనామా చేశారు.  మంగ‌ళ‌వారం  విలేక‌ర్ల స‌మావేశంలో ప్ర‌కాశ్‌రాజ్ ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. మా ప్యాన‌ల్ అభ్య‌ర్థి బెన‌ర్జీపై మోహ‌న్‌బాబు చేయిచేసుకోవ‌డం చాలా బాధక‌రం.  ఒక సీనియ‌ర్ న‌టుడు చేయి చేసుకోవ‌డం ఏమిటి అని ప్ర‌శ్నించారు. మేము బ‌య‌ట ఉండి చూస్తాం. మా లో రెండు వ‌ర్గాల‌కు చెందిన వారు ఉంటే త‌రుచూ విభేదాలు వ‌స్తాయి. అందుకే  మా ప్యాన‌ల్ కు సంబంధించిన 11 మంది  రాజీనామా చేశారు.

 
ఓట‌ర్ల‌కు రెస్పాన్స్‌బుల్‌గా ఉండాలి. రేపు ప‌ని చేయ‌క‌పోతే ప్ర‌శ్నిస్తాం. ప‌నికి అడ్డు రాం. గొడ‌వ‌లు వ‌ద్దు. మా అసోసియేష‌న్‌ను రెండేళ్ల‌పాటు అభివృద్ధి చేయండి.  మా నిర్ణ‌యాన్ని ఒప్పుకుంటార‌ని ఆశిస్తున్నా.నేను ప్రైమ‌రీ స‌భ్య‌త్వానికి రాజీనామా చేశాను. విష్ణు ఎవ‌రైనా పోటీ చేయ‌వ‌చ్చు అని మాట ఇస్తేను నేను ఒప్పుకుంటాను. అదేవిధంగా మా కు ధీటుగా మ‌రో అసోసియేష‌న్ వ‌స్తున్న‌ద‌ని.. ప్ర‌చారం జ‌రుగుతుంది. అలాంటిది ఏమి లేదు. ఆత్మ‌, ప‌ర‌మాత్మ అనేవి ఏమి ఉండ‌వు. కేవ‌లం తెలుగు ఇండ‌స్ట్రీకి మా అసోసియేష‌న్ ఒక్క‌టే ఉంది. దాని అభివృద్ధే ముఖ్యం అని ప్ర‌కాశ్‌రాజ్ చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: