అమెజాన్‌.. ఫ్లిప్‌కార్ట్ హోరాహోరీ..?

Garikapati Rajesh

ప్ర‌తి సంవ‌త్స‌రం విజ‌య‌ద‌శ‌మి, రిప‌బ్లిక్‌డే, స్వాతంత్ర్య దినోత్స‌వం, దీపావ‌ళి త‌దిత‌ర పండ‌గ‌ల సంద‌ర్భంగా ప్ర‌త్యేక విక్ర‌యాలు చేప‌ట్టే ఆన్‌లైన్ ఈ కామ‌ర్స్ సంస్థ‌లు ఈసారి పోటోపోటీగా ముందుకు సాగుతున్నాయి. ద‌స‌రా ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా ఫ్లిప్‌కార్ట్ అక్టోబ‌రు 7 నుంచి 10వ తేదీ వ‌ర‌కు బిగ్‌బిలియ‌న్ డేస్ జ‌రుగుతాయ‌ని ప్ర‌క‌టించింది. దీంతో పోటీ సంస్థ అమెజాన్ వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకునేందుకు అక్టోబ‌రు నాలుగోతేదీ నుంచి గ్రేట్ ఇండియ‌న్ ఫెస్టివ‌ల్ పేరుతో విక్ర‌యాలు జ‌రుగుతాయ‌ని ప్ర‌క‌టించింది. దీంతో ఫ్లిప్‌కార్ట్ మ‌ళ్లీ త‌న బిగ్‌బిలియ‌న్‌డేస్ తేదీని నాలుగోతేదీకి మార్చింది. అమెజాన్ తిరిగి త‌న విక్ర‌యాలు మూడోతేదీ నుంచి ప్రారంభ‌మ‌వుతాయ‌ని ప్ర‌క‌టించింది. ఫ్లిప్‌కార్ట్ కూడా అక్టోబ‌రు మూడోతేదీ నుంచే విక్ర‌యాలు ప్రారంభిస్తామ‌ని ప్ర‌క‌టించింది. చిన్న చిన్న విక్ర‌య‌దారులు, స్థానికంగా ఉండే దుకాణ‌దారుల ప్ర‌యోజ‌నాలే త‌మ‌కు ముఖ్య‌మని అమెజాన్ ప్ర‌క‌టించింది. మ‌రోవైపు ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన ఆన్‌లైన్ దుస్తుల విక్ర‌య సంస్థ మింత్రా అక్టోబ‌రు మూడో తేదీ నుంచి ప‌దోతేదీ వ‌ర‌కు ప్ర‌త్యేక ఫ్యాష‌న్ ఫెస్టివ‌ల్ నిర్వ‌హిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: