ప‌వ‌న్ క‌ల్యాణైనా, సంపూర్ణేష్‌బాబైనా ఒక్క‌టే?

Garikapati Rajesh

పరిశ్రమలోని కొందరు ప్రముఖులే ఏపీ ప్రభుత్వ పెద్దలతో చర్చించార‌ని, ఆన్‌లైన్ పోర్టల్ అంటే ఎందుకంత భయమ‌ని జ‌ల‌వ‌న‌రుల‌శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాద‌వ్ ప్ర‌శ్నించారు. ప‌వ‌న్‌క‌ల్యాణ్ వ్యాఖ్య‌ల‌కు ఆయ‌న ఆదివారం మీడియాతో మాట్లాడుతూ కౌంట‌ర్ ఇచ్చారు. ఆన్‌లైన్ పోర్ట‌ల్ వ‌ల్ల జరిగే నష్టం ఏమిటి? జ‌వాబుదారీత‌నం రావాలన్నదే సీఎం ఆలోచనని, పారదర్శకత కోసమే పోర్ట‌ల్ తెచ్చిన‌ట్లు చెప్పారు. అందరికీ టికెట్ ధర ఒకేలా ఉండాలనేది ప్ర‌భుత్వ ఉద్దేశ‌మ‌ని, సినిమా ఖర్చులో కేవలం నలుగురైదుగురికి మాత్రమే లబ్ధి ఎక్కువగా ఉంటుంద‌ని, ఇది ఎంతవరకు సబబో ప‌వ‌న్ ఆలోచించాల‌ర‌న్నారు. నా ఒక్కడి కోసం చిత్రసీమని వైసీపీ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని పవన్ కళ్యాణ్ మాట్లాడడం స‌రికాద‌ని, ఇది పవన్ కళ్యాణ్ క్రియేషన్ అని విమ‌ర్శించారు. చిత్రపరిశ్రమని ఇబ్బంది పెట్టే ఆలోచన జ‌గ‌న్ ప్రభుత్వానికి లేద‌ని, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో పవన్ క‌ల్యాణ్ మాట్లాడుతున్నార‌ని, చిత్ర పరిశ్రమనంతా ఇబ్బంది పెడుతున్నామని ప్రొజక్షన్ ఇచ్చుకోవడం స‌రికాద‌ని అనిల్ అన్నారు. రాజకీయ ఉనికి కోసం ముఖ్య‌మంత్రి జగన్‌ని తిట్టడం పవన్ కల్యాణ్‌కు ఫ్యాషన్ అయిపోయింద‌ని, ప్రభుత్వ తీరును మారుస్తాను, నేను రోడ్డుపైకొస్తే మనిషిని కాదు, బెండు తీస్తామంటూ చాలాసార్లు మాట్లాడార‌ని ఎద్దేవా చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: