భారత్‌కు తీపిక‌బురు

Garikapati Rajesh

భారత ప్రయాణికులకు కెనడా శుభ‌వార్త చెప్పింది. భారత విమానాలపై కొన‌సాగుతోన్న నిషేధాన్ని తొలగించింది. దీంతో ఇరు దేశాల మధ్య విమాన రాకపోకలపై ఐదు నెలలకు పైగా కొనసాగిన నిషేధం తొలిగిపోయింది. సోమవారం నుంచి భారత్‌కు నేరుగా విమానాలు నడపనున్నట్లు ట్రాన్స్‌పోర్ట్ కెనడా ప్రకటించింది. రేపు ఎయిర్ కెనడాకు చెందిన తొలి విమానం భారత్ నుంచి కెనడాకు బయలుదేర‌బోతోంది. ఈ నెల 30 నుంచి ఎయిర్ ఇండియా ఇరు దేశాల మధ్య విమాన సర్వీసులు కూడా ప్రారంభించ‌బోతోంది. నేరుగా విమానంలో కెనడాకు వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా త‌మ జర్నీకి 18 గంటల ముందు ఢిల్లీ విమానాశ్రయంలో ఆర్‌టీ-పీసీఆర్ ప‌రీక్ష చేయించుకోవాలి. అందులో నెగెటివ్ రావాలి. క్యూఆర్ కోడ్‌తో కూడిన సర్టిఫికేట్‌ను అక్క‌డే అంద‌జేస్తారు. బోర్డింగ్‌కు ముందు చెక్ చేసుకోవాంటూ ట్రాన్స్‌పోర్ట్ కెనడా తెలిపింది. క‌రోనా బారిన పడి కోలుకున్నవారు సైతం నెగెటివ్ సర్టిఫికేట్ చూపించాల్సి ఉంటుందని, ప్రయాణానికి 14 రోజుల నుంచి 180 రోజుల ముందు ఈ సర్టిఫికేట్ తీసుకుంటే చాలంది. ఒకవేళ ప్రయాణికులు ఎవరైనా ఈ షరతులకు లోబడి లేకుంటే బోర్డింగ్‌కు నిరాకరిస్తార‌ని స్పష్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: