స్మశాన వాటిక నుంచి ఘాటైన పొగ, చివరకు...?

ఈ మధ్య కాలంలో కొన్ని ప్రాంతాల్లో కాలుష్యం ఎక్కువ కావడం ప్రజలను ఇబ్బంది పెడుతున్న అంశం. పట్టాన ప్రాంతాల్లో జనాభా పెరగడం ప్రజలకు కష్టంగా మారింది. కొన్ని ప్రాంతాల్లో ఇళ్ళ మధ్యలో స్మశాన వాటికలు కూడా ఉన్నాయి. ఈ నేపధ్యంలో తాజాగా గుంటూరు లో ఒక సంఘటన జరిగింది. స్మశాన వాటికకు తాళం వేసిన ఘటన ఇది. ఉండవల్లి ఇళ్ల మధ్యలో ఉన్న హిందూ స్మశాన వాటిక లో తరచూ చెత్త వేస్తున్నారు పారిశుద్ధ్య కార్మికులు.
అక్కడ ఉన్న చెత్తను తగులబెట్టడంతో గ్రామంలోకి వస్తున్న ఘాటైన పొగతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. స్థానికులు ఎన్నిసార్లు  పిర్యాదు చేసినా పంచాయితీ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో చెత్త ట్రాక్టర్లను అడ్డుకొని సన్మాన గేట్లకు స్థానికులు తాళం వేసారు. ట్రాక్టర్లను కాజా లోని డంపింగ్ యార్డుకి తరలించిన పంచాయితీ సిబ్బంది... ఇంకో సారి రిపీట్ చేయమని చెప్పినట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: