వివేకా హ‌త్య‌కేసు నిందితుణ్ని గుర్తించారా?

Garikapati Rajesh

మాజీ మంత్రి డాక్ట‌ర్ వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య‌కేసు విచార‌ణ జ‌ర‌గుతోన్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా రెండోద‌శ ఉధృతి త‌గ్గిన త‌ర్వాత ద‌ర్యాప్తు ప్రారంభించిన సీబీఐ అధికారులు ఒక్క‌రోజు కూడా విరామం ఇవ్వ‌కుండా నాలుగు నెల‌లుగా త‌మ విచార‌ణ‌ను కొన‌సాగిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ప‌లువురు అనుమానితుల‌ను ప్ర‌శ్నించ‌డం, ఛార్జిషీట్లు దాఖ‌లు చేయ‌డం జ‌రిగాయి. క‌డ‌ప జైల్లో రిమాండ్‌లో ఉన్న నిందితుడు ఉమాశంక‌ర్‌రెడ్డిని గుర్తించ‌డానికి వివేకా వాచ్‌మెన్ రంగ‌న్న‌ను తీసుకువ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. జ‌మ్మ‌ల‌మ‌డుగు న్యాయ‌మూర్తి స‌మ‌క్షంలో ఈ గుర్తింపు కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. వివేకా హ‌త్య జ‌రిగిన‌రోజు రాత్రి తాను ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను చూశాన‌ని రంగ‌న్న చెప్పారు. దీంతో వారిలో ఉమాశంక‌ర్‌రెడ్డి ఉన్నారా?  లేదా? అనేది నిర్థారించ‌డానికి ఈ ప‌రేడ్ నిర్వ‌హించారు. అయితే ఇంత‌వ‌ర‌కు సీబీఐ అధికారులు రంగ‌న్న ఉమాశంక‌ర్‌రెడ్డి హ‌త్య‌జ‌రిగిన‌రోజు ఉన్నాడు? అని చెప్పాడా?  లేదా? అనేది మాత్రం స్ప‌ష్టం చేయ‌లేదు. కేసు ద‌ర్యాప్తుల‌పై ఇప్ప‌టి రెండు తెలుగు రాష్ట్రాల్లో విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. న‌త్త‌న‌డ‌క‌న సాగుతున్న ద‌ర్యాప్తును వేగవంతం చేయాల‌ని, నిందితుల‌ను ప‌ట్టుకోవాల‌ని వివేకా కుటుంబ స‌భ్యులు కూడా కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: