జూబిలీహిల్స్ లో భారీ చోరీ?

Chaganti
జూబ్లీహిల్స్ లో శనివారం నాడు జరిగిన భారీ చోరీ ఘటన సంచలనంగా మారింది. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి తెలిసిన వారికి డబ్బు ఇవ్వాలని డ్రైవర్ శ్రీనివాస్ కు ఇచ్చి పంపాడు. అయితే అతని డ్రైవర్ శ్రీనివాస్ రూ.55 లక్షల డబ్బు సహా కారు కూడా తీసుకొని జంప్ అయ్యాడు, అయితే పంపి చాలా సేపు అయ్యాక కూడా డ్రైవర్ వెనక్కు రాకపోవడమే కాక ఎన్ని సార్లు ఫోన్ చేసినా స్విచ్చాఫ్ రావడంతో మోసపోయామని అర్ధం కావడంతో వెంటనే రియల్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన జూబ్లీహిల్స్ పోలీసులు డ్రైవర్ శ్రీనివాస్ ను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారుల, శ్రీనివాస్ ఫోన్ సిగ్నల్స్, హైవేల మీద సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. మొత్తం మీద ఈ కారు, డబ్బు దొంగతనం కేసు సంచలనంగా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: