పైచేయి కోసం ఎమ్మెల్యే రోజా పట్టు!

N.Hari
చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గానికి సంబంధించి నిండ్రా మండల పరిషత్‌ అధ్యక్ష ఎన్నిక రెండో రోజు కూడా ఉద్రిక్తతకు దారి తీసింది. అధికార వైసీపీ ఎమ్మెల్యే రోజా సొంత నియోజకవర్గంలో నిండ్రా మండల పరిషత్ అధ్యక్ష ఎన్నిక తీవ్ర వివాదంగా మారింది. ఇక్కడ ఎమ్మెల్యే రోజా వర్గీయులు, చక్రపాణి వర్గీయుల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇక్కడ రెండో రోజు జరిగిన ఎంపీపీ ఎన్నికలో తన మద్దతుదారులకు మెజారిటీ లేకపోయినా.. పైచేయి సాధించేందుకు  ఎమ్మెల్యే రోజా ఓటింగ్‌ను అడ్డుకున్నారు. అధికారులతో ఆమె వాగ్వాదానికి దిగారు. జగన్ గారి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. నిజానికి నిండ్రా మండల పరిషత్ అధ్యక్ష ఎన్నికల్లో రోజా తరపు వారికి మెజారిటీ రాలేదు. ఐదుగురితో మెజారిటీలో ఉన్న భాస్కర్ రెడ్డి వర్గాన్ని ఓటింగ్ వేయకుండా ఎమ్మెల్యే రోజా వర్గం అడ్డుకుంది. స్వపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యే రోజా తీరుపై చక్రపాణి రెడ్డి, భాస్కర్ రెడ్డి వర్గీయులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ విషయాన్ని పార్టీ హైకమాండ్‌ దృష్టికి తీసుకెళ్తామని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: