700 కోట్లను ఫ్రీజ్ చేసేసారు... కొడుకులను టార్గెట్ చేసారు...?

కార్వి కేస్ లో ఈడి దూకుడు ఇప్పుడు కొందరిని కంగారు పెడుతుంది. 3000 కోట్ల రూపాయల ఫ్రాడ్ కేస్ లో ఈడి దర్యాప్తు ప్రస్తుతం స్పీడ్ గా జరుగుతుంది. సీసీ ఎస్ ఎఫ్ ఐ ఆర్ ఆధారంగా రంగంలోకి దిగిన ఈడి... ఇటీవల హైదరాబాద్, గుంటూరు లలో పార్థసారధి ఇల్లు, కార్యాలయాల పై దాడులు నిర్వహించింది. హైదరాబాద్ కార్వి హెడ్ ఆఫీస్ లో 10 గంటల పాటు సోదాలు నిర్వహించిన ఈడి... సంస్థ షేర్ లను ఫ్రీజ్ చేయాలని ఆదేశాలు ఇచ్చింది.
పార్థసారధితో పాటుగా అతని కుమారులు రజట్ పార్థసారథి అలాగే అధిరజ్ పార్థసారధి లకు సంబంధించిన షేర్ లను ఫ్రీజ్ చేయనున్నారు అధికారులు. కార్వి కు సంబందించిన 700 కోట్ల రూపాయల షేర్ లను ఫ్రీజ్ చేయడం తో ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts

సంబంధిత వార్తలు: