త‌ల‌సేమియా బాధితుల‌కు అండ‌గా ప్రభాస్ ఫ్యాన్స్

RATNA KISHORE
శ్రీ‌కాకుళం న‌గ‌రం: త‌ల‌సేమియాతో బాధ‌ప‌డుతున్న చిన్నారుల‌కు అండ‌గా ప్ర‌భాస్ ఫ్యాన్స్ అండ‌గా నిలిచారు. జిల్లా కేంద్రంలో ఉన్న చి న్నారుల‌కు ప్ర‌తి నెలా ప్ర‌భుత్వ, ప్ర‌యివేటు ఆస్ప‌త్రుల‌కు చికిత్స నిమిత్తం త‌ర‌లించేందుకు వారికొక వాహ‌నంను అందుబాటులో కి తెచ్చారు. దాత‌ల స‌హ‌కారంతో చేప‌ట్టిన ఈ బృహ‌త్త‌ర కార్య‌క్ర‌మం ఇంకా ప్రాథ‌మిక దశ‌లో ఉంది. త్వ‌ర‌లోనే ఈ కార్య‌క్ర‌మం పూర్తి రూపం తెచ్చుకోనుంది. ఇదే కాకుండా ప్ర‌భాస్ ఫ్యాన్స్ నేతృత్వాన నిరుపేద‌లు, అనాథ‌లు మ‌ర‌ణిస్తే వారి పార్థివ దేహాల‌ను త‌రలిం చేందుకు ఒక కైవ‌ల్య ర‌థాన్ని అందుబాటులోకి తెచ్చారు. దీంతో పాటు మ‌రో రెండు అంబులెన్స్ స‌ర్వీసుల‌ను ఉచితంగా పేద‌ల కో సం, అభాగ్యుల కోసం, అవ‌స‌రార్థ‌మై త‌మ‌ను సంప్ర‌దించే దిగువ మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబాల కోసం న‌డుపుతున్నారు. ఇవే కాకుండా న‌గ‌రంలో మూడు ప్ర‌ధాన కూడ‌ళ్ల వ‌ద్ద ఫుడ్ కోర్టుల‌ను ఏర్పాటుచేశారు. సూర్య‌మ‌హ‌ల్ కూడ‌లి, ఏడు రోడ్ల కూడ‌లి, డే అండ్ నైట్ కూడలి లో ప్ర‌తిరోజూ రెండు పూటలా 150 మంది పేద‌ల‌కు అన్న‌దానం చేస్తున్నారు. వీరికి అండ‌గా కొంద‌రు దాత‌లు నిలుస్తు న్నారు. వారి సాయంతోనే తాము ఇన్ని మంచి కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నామ‌ని డాడీ హెల్పింగ్ ఫౌండేష‌న్, జిల్లా ప్ర‌భాస్ ఫ్యాన్స్ అధ్య‌క్షులు జి.సూర్య‌నారాయ‌ణ తెలిపారు. కొన్ని సంద‌ర్భాల్లో త‌మ‌కు ఫ్రెండ్స్ ఫ‌ర్ సొసైటీ నిర్వాహ‌కులు సాధ‌న‌, మాన‌స ఇంకా ఇత‌ర మిత్రులు స‌హ‌క‌రిస్తున్నార‌ని, వారి సాయంతో కూడా తాము కొన్ని మంచి కార్య‌క్ర‌మాలు చేయ‌గ‌లిగామ‌ని చెప్పారు. ఇక‌పై కూడా తాము మ‌రిన్ని మంచి కార్య‌క్ర‌మాల‌కు రూప‌క‌ల్ప‌న చేయ‌నున్నామ‌ని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: