బిగ్ బ్రేకింగ్: పెగాసాస్ పై సుప్రీం విచారణ కమిటీ ఏర్పాటు...?

పెగాసస్ స్నూపింగ్ కేసు దర్యాప్తు కోసం గానూ సుప్రీం కోర్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే వారం దీనిపై వివరణాత్మక ఉత్తర్వులను జారీ చేస్తామని భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ గురువారం ప్రకటన చేసారు. మేము వచ్చే వారం నాటికి టెక్నికల్ ఎక్స్‌పర్ట్ టీమ్ సభ్యులను ఖరారు చేస్తామని సీజే పేర్కొన్నారు. పెగాసాస్ పై నేడు సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టీస్ ధర్మాసనం విచారణ జరిపింది.
భారతదేశంలోని ప్రముఖ జర్నలిస్టులు మరియు రాజకీయ నాయకుల ఫోన్‌లను హ్యాక్ చేసే ప్రయత్నాలు జరిగాయి అనే ఆరోపణలు వినిపించాయి. నిపుణుల కమిటీలో భాగంగా ఉండటానికి సంప్రదించిన కొంతమంది నిపుణులు వ్యక్తిగత సమస్యలను ఎదుర్కొంటున్నారని అందుకే వారు విచారణలో పాల్గొనడం లేదని తెలిపారు. పెగాసాస్ విషయంలో జాతీయ భద్రతను కారణంగా చూపిస్తూ... వివరణాత్మక అఫిడవిట్ దాఖలు చేయడానికి ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయకపోవడంతో సుప్రీం సీరియస్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: