వైసీపీలో భ‌గ్గుమ‌న్న విభేదాలు?

Garikapati Rajesh

నెల్లూరు జిల్లా గూడూరు వైసీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. కె.నాగలాపురం ఎంపీపీ పదవి కోసం మహిళా ఎంపీటీసీ రాజమ్మ, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ విగ్రహం ముందు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే  సుధాకర్ ఎంపీపీ పదవిపై హామీ ఇచ్చి మాటత‌ప్పారంటూ ఎంపీటీసీ, కార్యకర్తలు భోరున విలపించారు. ప‌ద‌వి ఇస్తామ‌ని చెబితేనే పోటీచేశామ‌ని, క‌ష్ట‌ప‌డి గెలిచామ‌ని, ఇప్పుడేమో మాట త‌ప్పి త‌న‌వారికి ప‌ద‌విస్తున్నారంటూ మండిప‌డ్డారు. ఎంపీపీ ప‌ద‌వుల కోసం ఒక్క నెల్లూరు జిల్లానే కాకుండా రాష్ట్ర‌వ్యాప్తంగా అధికార వైసీపీలో విభేదాలు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. కొంద‌రు ఎంపీ ద‌గ్గ‌ర నుంచి హామీ తీసుకొని, మ‌రికొంద‌రు ఎమ్మెల్యేల ద‌గ్గ‌ర‌నుంచి హామీలు తీసుకొని పోటీచేయ‌డం, ఆ త‌ర్వాత ఇరువ‌ర్గాల మ‌ధ్య విభేదాల‌తో ప‌దువ‌ల కోసం పోటీప‌డ‌టంలాంటివ‌న్నీ జ‌రుగుతున్నాయి. జిల్లాకు ఇన్‌చార్జిలుగా ఉన్న మంత్రుల‌కు, ఎమ్మెల్యేల‌కు ఎంపీపీ అధ్య‌క్ష బాధ్య‌త‌ల‌ను పార్టీ అధిష్టానం అప్ప‌జెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ycp

సంబంధిత వార్తలు: