ఏపీలో హ్యాపీ నెస్ట్ ముగిసినట్టే...?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు చేపట్టే కార్యక్రమాలకు సంబంధించి స్పందన దొరకడం లేదు. కొన్ని ప్రాజెక్ట్ లపై కాంట్రాక్టర్ లు ఆసక్తి చూపడం లేదు. తాజాగా హ్యాపీ నెస్ట్ రివర్స్ టెండర్ల కు స్పందన కరువు అయింది. గడువు ముగిసిన కాంట్రాక్టర్లు అనాసక్తిగా ఉన్నారని వెల్లడి అయింది. అమరావతిలో టీడీపీ హయాంలో హ్యాపీ నెస్ట్ అపార్ట్మెంట్స్ నిర్మాణానికి రూపకల్పన చేస్తున్నారు.
అపార్ట్మెంట్లు కైవసం చేసుకునేందుకు ఎగబడిన ఎన్నారైలు, తెలుగువారు... ఇప్పుడు ముందుకు రావడం లేదు. పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించారు ఎన్ఆర్ఐ లు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక హ్యాపీ నెస్ట్ అపార్ట్ మెంట్ లకు రివర్స్ టెండరింగ్ పేరుతో టెండర్లు వేయడంతో... ఇబ్బందులు వచ్చాయి. గడువు పొడిగించినప్పటికీ టెండర్లు పడటం లేదు. ఇప్పటికే కోర్టుకు వెళ్లిన లబ్ధిదారులు... తమ డబ్బులు తిరిగి ఇచ్చి వేయాలని కోర్టులో పిటిషన్లు వేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: