త‌ల న‌రికి వెంట తీసుకువెళ్లారు..!!

Garikapati Rajesh

త‌మిళ‌నాడులోని దిండుగల్‌ సమీపం శెట్టినాయకన్‌పట్టిలో పాతకక్షల నేపథ్యంలో ఓ వృద్ధురాలిని దార‌ణంగా హ‌త్య‌చేశారు.  ఆ వృద్ధురాలు మృతి చెందిన తర్వాత హంతకులు తలను నరికి త‌మ‌తోపాటు తీసుకువెళ్లారు. పదేళ్ళకు ముందు ఆ ప్రాంతంలోనే దేవేంద్రకుల వెల్లాలర్ సంఘ‌ నాయకుడు పశుపతి పాండ్యన్‌ను కొంద‌రు వేటకొడవళ్ళతో దాడి చేసి హత్య చేశారు. ఆ కేసులో పదిమందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో శెట్టినాయకన్‌పట్టికి చెందిన నిర్మలా దేవి(65) ఉన్నారు. పశుపతి పాండ్యన్ ను గుర్తించేందుకు సహకరించిందని, హంతకులకు తన ఇంట ఆశ్రయమిచ్చిందనే అనుమానంతో ప్రత్యర్థులు ఆమెను చంపేందుకు సిద్ధమయ్యారు. ఉదయం నిర్మలాదేవి అరివుతిరుక్కోవిల్‌ సమీపంలో నడచి వెళుతుండగా గుర్తు తెలియ‌ని వ్యక్తులు కత్తులతో దాడి చేయ‌గా అక్క‌డిక‌క్క‌డే ఆమె మరణించింది. హంతకులు నిర్మలాదేవి మృతి చెందినట్లు నిర్ధారించుకున్న తర్వాత ఆమె తలను కత్తితో నరికి తమతోపాటు తీసుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని నిర్మలాదేవి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం దిండుగల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి త‌ర‌లించారు. హంత‌కుల కోసం గాలింపు ముమ్మ‌రం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: