జమ్మూలో ఎన్ కౌంటర్.. టెర్రరిస్ట్ హతం!

Chaganti
జమ్ముకశ్మీర్‌ లోని షోపియాన్‌ లో గురువారం భద్రతా దళాలు జరిపిన ఎన్‌ కౌంటర్‌ లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు, షోపియాన్‌ జిల్లాలోని జైనాపోరా ప్రాంతంలోని కాశ్వ గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం రావడంతో భద్రతా దళాలు ఆ ప్రాంతంలో కార్డన్ మరియు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి అని అధికారులు తెలిపారు. సెర్చ్ ఆపరేషన్ తర్వాత ఉగ్రవాదులు కాల్పులు జరిపారు, దానికి సమాధానంగా భద్రతా దళాలు కూడా ఎదురు దాడి చేశాయి, ఆ తర్వాత సెర్చ్ ఆపరేషన్ ఎన్‌ కౌంటర్‌ గా మారిందని అధికారులు పేర్కున్నారు. మరణించిన ఉగ్రవాది  ఎవరు? ఏ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కోసం పని చేస్తున్నాడు అనే విషయం మీద క్లారిటీ రాలేదు.  పోలీసులు వెల్లడించిన సమాచారమును ప్రకారం, నిన్న రాత్రి ఒక పౌరుడిపై టెర్రరిస్ట్ కాల్పులు జరపడంతో భద్రతా దళాల ఆపరేషన్ ప్రారంభించబడిందని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: