అయేషా మీరా కేసు: సిబిఐ కు బెజవాడలో షాక్

యేషా మీరా హత్యకేసు 12 ఏళ్ళ క్రితం ఏ రేంజ్ లో సంచలనం సృష్టించింది అనేది అందరికి తెలిసిందే. ఈ కేసుకి సంబంధించి అప్పట్లో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న కోనేరు రంగారావు మనువడి పై విమర్శలు వచ్చాయి. అయితే అయేషా మీరా హత్య కేసులో నిందితులకు నార్కో ఎనాలసిస్ పరీక్షలు నిర్వహించాలని సిబిఐవేసిన పిటిషన్ ను నేడు విజయవాడ కోర్ట్ కొట్టేసింది.
విజయవాడ కోర్టు లో పిటిషన్ వేసిన సిబిఐ... మొత్తం ఏడుగురు నిందితులకు నార్కో అనాలసిస్ పరీక్షలు నిర్వహించాలని పిటిషన్లో కోర్ట్ ని కోరింది. సిబిఐ , నిందితులు తరుపున వాదనలను విజయవాడ కోర్టు విన్నది. నిందితుల తరపున వాదనలను సీనియర్ న్యాయవాది సుంకర రాజేంద్ర ప్రసాద్ వినిపించారు. కొద్దిసేపటి క్రితం సిబిఐ వేసిన పిటిషన్ ను కోర్ట్ డిస్మిస్ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: