ఏపీలో బయటపడిన మరో స్కాం...?

ఏపీ ప్రభుత్వం అవినీతిని సీరియస్ గా తీసుకున్నా సరే కొందరిలో మార్పు రావడం లేదు. ఏపీ ప్రభుత్వ అధికారులు అవినీతికి పాల్పడే విషయంలో సిఎం వైఎస్ జగన్ సీరియస్ గా దృష్టి పెట్టారు. కీలక అధికారుల మీద ఈ మధ్య కాలంలో ఫోకస్ చేసారు. సచివాలయంలో జరుగుతున్న వ్యవహారాల మీద కూడా ఎక్కువగా దృష్టి సారించారు. ఏపీలో ముఖ్యమంత్రి సహాయ నిధి అంశం మీద కూడా ఎక్కువ ఫోకస్ పెట్టారు.
సీఎంఆర్ఎఫ్ నిధులు గోల్ మాల్ వ్యవహారం బయటకు వచ్చింది. ఏపీ సచివాలయంలో భారీ స్కామ్ ను గుట్టు రట్టుచేసింది. పేదల డేటా సేకరించి సీఎంఆర్ఎఫ్ నిధులు పక్కదారి పట్టించారు అని వెల్లడి అయింది. 50 మంది ప్రమేయం ఉన్నట్టుగా గుర్తించారు. ప్రజాప్రతినిధుల పిఏలు , అనుచరుల పాత్రపై ఆరా తీస్తున్నారు. కేసులో పలువురు నిందితులను అరెస్ట్ చేసిన ఏసీబీ.. త్వరలోనే మరికొందరిని అరెస్ట్ చేయవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: