అసలు బెజవాడ డ్రగ్స్ వాల్యూ ఎన్ని వేల కోట్లు...?

డ్రగ్స్ వ్యవహారంలో మరింత లోతుగా డి ఆర్ ఐ దర్యాప్తు మొదలు పెట్టింది. విజయవాడ కేంద్రంగా ఈ డ్రగ్స్ దందా నడుస్తున్న నేపధ్యంలో ఇది రాజకీయ రంగు కూడా పులుముకుంటుంది. దీనిపై అధికార పక్షాన్ని విపక్షాలు ఎక్కువగా టార్గెట్ చేస్తున్నాయి. గతంలో ఇటువంటి కన్సైన్మెంట్ లు వచ్చాయా అనే కోణంలో దృష్టి కేంద్రీకరించిన డి ఆర్ ఐ అధికారులు... కీలక వ్యక్తుల మీద నిఘా పెటారు.
రంగంలోకి దిగిన సెంట్రల్ విజిలెన్స్, నార్కోటిక్ బ్యూరో, కస్టమ్స్ అండ్ ఎక్సైజ్, నేవీ ఇంటెలిజెన్స్... డ్రగ్స్ విలువ 21 వేల కోట్లు గా అంచనా వేసినట్టు తెలిసింది. సుధాకర్ దంపతులను చెన్నైలో అదుపులోకి తీసుకున్న డి ఆర్ ఐ అధికారులు గుజరాత్ కు తరలించి విచారిస్తున్నారు. పదిరోజుల డి ఆర్ ఐ కస్టడీకి అప్పగించారు. మనీలాండరింగ్ కోణంలోనూ దర్యాప్తు ముమ్మరం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: