లిక్కర్ షాపుల కేటాయింపులో రిజర్వేషన్ల ఉత్తర్వుల జారీ..!

ఎస్సీ ఎస్టీల‌కు మ‌రియు గౌడ కుల‌స్థుల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం లిక్క‌ర్ షాపుల్లో రిజ‌ర్వేష‌న్ లు క‌ల్పిస్తామ‌ని ఇటీవ‌ల ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ మేర‌కు మంత్రి వ‌ర్గం కూడా దీనిపై ఆమోదం తెలిపింది. కాగా తాజాగా ప్ర‌భుత్వం లిక్క‌ర్ షాపుల్లో రిజ‌ర్వేష‌న్ లు క‌ల్పిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఏ-4  కాటగిరిలో  లిక్కర్ షాపుల కేటాయింపులో గౌడ కుల‌స్థుల‌కు 15 శాతం శాతం రిజ‌ర్వేష‌న్ లు క‌ల్పిస్తున్న‌ట్టు స్ప‌ష్టం చేసింది. అదే విధంగా షెడ్యూల్ కులాల వారికి 10 శాతం రిజ‌ర్వేషన్ క‌ల్పిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. 

అంతే కాకుండా షెడ్యూల్ తెగలకు 5 శాతం కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ రోజు ప్రభుత్వం రిజ‌ర్వేష‌న్ల‌పై క్లారిటీ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక కేసీఆర్ తీస‌కున్న ఈ నిర్ణ‌యంపై రాష్ట్రంలోని గౌడ కుల‌స్థులు మ‌రియు ఎస్సీ, ఎస్టీ కులాల వారు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టికే కేసీఆర్ తీసుకున్న నిర్ణ‌యంపై హ‌ర్షం వ్య‌క్తం చేస్తూ ప్ర‌భుత్వం పై ప్ర‌శంస‌లు కురిపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: