కేసీఆర్ దిష్టి బొమ్మలు దగ్ధం చేయండి : కాంగ్రెస్

Chaganti
తెలంగాణలో డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపుతోంది, ఇప్పటికే ఈ అంశం మీద రేవంత్ రెడ్డి, కేటీఆర్  ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. రేవంత్ రెడ్డి ఇంటిపై టిఆర్ఎస్ గుండాల దాడికి నిరసనగా కేసీఆర్ దిష్టిబొమ్మలను దగ్ధం చేయమని కాంగ్రెస్ కార్యకర్తలకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి పిలిపునిచ్చారు. మంత్రి కేటీఆర్ వైట్ ఛాలెంజ్ విసిరి డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ చేయాలని సత్ సంకల్పంతో నిన్న గన్పార్కు వద్ద టీపీసీసీ అధ్యక్షులు శ్రీ రేవంత్ రెడ్డి చేసిన ప్రయత్నం తో ఉలిక్కి పడ్డ టిఆర్ఎస్ గుండాలు ఈ రోజు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఇంటిపై దాడి చేశారని, ఈ అప్రజాస్వామిక చర్యలను ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో  కేసీఆర్ దిష్టిబొమ్మలు దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేయాలని ప్రకటనలో కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: