డ్రగ్స్ కేసులో కేటీఆర్ ను ఏమనొద్దు.. కోర్టు కీలక ఆదేశాలు!

Chaganti
సంచలనం రేపుతున్న డ్రగ్స్ కేసు వ్యవహారం కోర్టు దాకా వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక ఈ కేసులో కేటీఆర్ తరుపు న్యాయవాదులు తమ క్లయింట్ పరువు ను భంగం కలిగేలా రేవంత్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారని, ఆయనకు డ్రగ్స్ కు ఎలాంటి సంబంధం లేకుండా ఉద్దేశ పూర్వకంగా తన పై దుష్ప్రచారం చేస్తున్నారని వాదించారు. ఆయన ఎమ్మెల్యేగా మంత్రిగా పదవుల్లో ఉన్నారని,  కాబట్టి కోటి రూపాయలు పరువు నష్టం చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఇలాంటి ఆరోపణలు మరోసారి చేయకుండా , శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నాం అని కేటీఆర్ తరుపు న్యాయవాది కోరగా డ్రగ్స్ కేసులో , ఈడీ కేసులో కేటిఆర్ పై ఎలాంటి వాఖ్యలు చేయకూడదు అని సిటీ సివిల్ కోర్టు  ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చింది. తదుపరి విచారణ అక్టోబర్ 20 కి వాయిదా వేసి రేవంత్ రెడ్డి కి నోటీసులు జారీ చేశారు. కౌంటర్ దాఖలు చేయాలని రేవంత్ కు ఆదేశాలు జారీ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: