బిగ్ బ్రేకింగ్; షర్మిల అరెస్ట్

వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత వైఎస్ షర్మిలను కాసేపటి క్రితం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మేడిపల్లి పోలీసులు బోడుప్పల్ లో ఆమె దీక్ష చేస్తున్న సమయంలో అదుపులోకి తీసుకున్నారు. అనుమతి నిరాకరించిన సరే నగరంలోని బోడుప్పల్లో షర్మిల దీక్షకు దిగడం సాయంత్రం వరకు దీక్ష చేస్తానని ప్రకటించడంతో పోలీసులు సీరియస్ అయ్యారు.
బోడుప్పల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ వద్ద ఉదయం నుంచి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది... తాము శాంతియుతంగా నిరసన దీక్ష చేస్తున్న సమయంలో ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని షర్మిల మేడిపల్లి పోలీస్ స్టేషన్ కు బయలు దేరగా అక్కడ పోలీసులు అడ్డుకున్నారు. దీనితో కార్యకర్తలతో కలిసి రోడ్డుపై షర్మిల ఆందోళన చేపట్టిన ఆ సమయంలో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని ముందు ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్కడి నుంచి అవుటర్ రింగ్ రోడ్డు మీదుగా షర్మిలను లోటస్ పాండ్ కు తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: