దేవుడా ఇది క‌లియుగం : స్వామినే మోసం చేస్తారా?

RATNA KISHORE

సాక్షాత్తూ క‌లియుగ దేవుడు వేంక‌టేశ్వ‌రుని ఆల‌యంలో ప‌దుగురికీ పంచే ప్ర‌సాదాల త‌యారీకి పంపిణీ చేసే సామ‌గ్రిలో కొన్ని కంపె నీలు మోసాల‌కు ఒడిగ‌డుతున్నాయి. శ్రీవారి ప్రసాదాలకు పురుగుపట్టిన జీడిపప్పును అంటగట్టే యత్నం చేస్తున్నాయి. బెంగ‌ళూ రుకు చెందిన హిందుస్థాన్ ముక్తా కంపెనీ చేసిన ఘరానా మోసంను ముందుగానే గుర్తించి జీడిపప్పు నాసిరకంగా ఉందని పది లో డ్లు వెనక్కు పంపింది. అయిన‌ప్ప‌టికీ అదే జీడిపప్పును మళ్లీ ప్యాకింగ్ మార్చి పంపుతున్న సంస్థ పంపుతుండ‌డంలో ఏ అర్థం ఉం దో మ‌రి! సాక్షాత్తూ ఆ దేవ దేవునికే తెలియాలి. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయానికి నాసిరకం జీడిపప్పు స‌ర‌ఫ‌రా చేస్తున్న సంస్థ‌తో సరఫరా సంస్థతో మార్కెటింగ్ విభాగంలో కొందరు ఉద్యోగుల కుమ్మక్కు అయ్యార‌ని తెలుస్తోంది. దీంతో అలిపిరి టీటీడీ వేర్‍హౌస్ కేంద్రంగా భారీ గోల్‍మాల్.. అయ్యాయ‌ని స‌మాచారం. వెంట‌నే అప్ర‌మ‌త్తం అయిన టీటీడీ అధికారులు పురుగు పట్టిన జీడి పప్పు సరఫరాపై సీరియస్‍గా స్పందించారు. త్వ‌ర‌లోనే సంబంధిత సంస్థ‌పై చ‌ట్ట‌ప‌ర చ‌ర్య‌లు తీసుకోనున్నారు. అదేవిధంగా సంస్థా గ‌తంగా త‌ప్పిదాలు చేసిన‌, మోసాల‌కు స‌హ‌క‌రించిన ఉద్యోగుల‌పై కూడా చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని టీటీడీ చెబుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ttd

సంబంధిత వార్తలు: