యునివర్సిటీలో పేలిన తుపాకి 8 మంది మృతి

యునివర్సిటీలో పేలిన తుపాకి
8 మంది మృతి
 రష్యా దేశంలో ని ఒక నగరంలో సోమవారం జరిగిన సంఘటన ప్రపంచ వ్యాప్తంగా విద్యార్దులు నివ్వెర పోయేలా చేసింది. మస్కో నగరానికి 1300 కిలోమీటర్ల దూరంలో ఉన్న పామ్ నగరంలోని విశ్వ విద్యాలయం లో సోమవారం ఒక విద్యార్థి తూపాకితో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 8 మంది అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. చాలా మంది గాయ పడ్డారు.
  యూనివర్సిటీలో ఒక్క సారిగా కాల్పుల శబ్దం రావడంతో విద్యార్ధలు  ఏం జరుగుతుందో తెలియక పరుగులు తీశారు. కిటికీలు, గోడలు ఎక్కి దూకేందుకు ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనూ పలువురు గాయపడ్డారు. పక్క నున్న భవనపు తరగతి గదుల్లో ఉన్న విద్యార్దులు కొందరు ఈ సంఘటనను తమ సెల్ ఫోన్ కెమెరాలలో బంధించారు. వాటిని  పోలీసులకు పంపించారు.  పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే లోగా అగంతక విద్యార్థి తన పై కూడా  కాల్పులు జరుపుకొని మృతి చెందాడు.
కాల్పులు జరిగిన సమయంలో తరగతి గదిలో 60 మంది విద్యార్ధులున్నారని ఘటనను ప్రత్యక్షంగా చూసిన సెమ్యాన్ అనే విద్యార్ధి మీడియాకు తెలిపారు. ఆగంతక విద్యార్థి ఈ దురాగతానికి పాల్పడడానికి కొద్ది గంటల ముందు హెల్మట్ ధరించి తుపాకి చేతపట్టుకొని ఓ గన్ మెన్ లా ఉండే ఫోటోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడని కూడా ప్రత్యక్ష సాక్షి తెలిపారు.
ఈ ఏడాది ఆరంభంలో కజన్ పట్టణంలోని పాఠశాలలో కూడా తుపాకి పేలించి . పదహారు, పద్దెనిమిది సంవత్సరాల మధ్య వయసున్న కుర్రాడు తూపాకి పేల్చి న ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు.
2018 సంవత్సరం లో కూడా ఇలాంటి ఘోరమైన సంఘటనే జరిగింది . ఆ ఘటనలో దాదాపు 20 మంది చనిపోయారు. రష్యాలో కఠిన మైన చట్టాలున్నా అవి సరిగా అమలుకావడం లేదని తల్లితండ్రులు వాపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: