హీరోయిన్ ఇంట తీవ్ర విషాదం..!

టాలీవుడ్ హీరోయిన్ నందిత శ్వేత ఇంట తీవ్ర విషాదం నెల‌కొంది. నందిత శ్వేత తండ్రి శివ స్వామి 54ఏళ్ల వ‌యసులో మృతి చెందారు. నందిత ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించింది. త‌న తండ్రి శివ స్వామి నిన్న మృతి చెందార‌ని నందిత ఎమోష‌న‌ల్ అయ్యారు. ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని...ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని త‌న శ్రేయోభిలాషులంద‌రికీ ఈ విష‌యాన్ని తెలుపుతున్నాన‌ని నందిత శ్వేత పేర్కొన్నారు. 

త‌న తండ్రి లేని లోటు తీర్చ‌లేనిద‌ని...ఆయ‌న మృతి ప‌ట్ల చింతిస్తున్నాన‌ని నందిత శ్వేత ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇక నందిత శ్వేత త‌మిళ సినిమాల‌తో ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఎక్క‌డ‌కు పోతావు చిన్న‌వాడా సినిమాతో టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మై దెయ్యం పాత్ర‌లో అద‌ర‌గొట్టింది. ఈ సినిమాలో నందిత పాత్ర‌కు మంచి గుర్తింపు రావ‌డంతో వ‌రుస సినిమాల‌తో ఫుల్ బిజీగా మారింది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: