నాది రేవంత్‌రెడ్డి స్థాయి కాదు..!

Garikapati Rajesh

రాహుల్‌గాంధీ ఒప్పుకుంటే ఎయిమ్స్ లో ప‌రీక్ష‌లు చేయించుకునేందుకు సిద్ధంగా ఉన్నాన‌ని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. చ‌ర్ల‌ప‌ల్లి జైలుకు వెళ్లివ‌చ్చిన‌వారితో త‌న స్థాయి కాద‌న్నారు. క్లీన్‌చిట్ వ‌స్తే రేవంత్ క్ష‌మాప‌ణ‌లు చెప్పి త‌న ప‌ద‌వుల‌ను వ‌దులుకుంటారా? అని ప్ర‌శ్నించారు. ఓటుకు నోటు కేసులో లైడిటెక్ట‌ర్ ప‌రీక్ష‌కు రేవంత్ సిద్ధ‌మా? అని స‌వాల్ విసిరారు. ఎటువంటి ప‌రీక్ష‌ల‌కైనా తాను సిద్ధంగానే ఉన్నాన‌ని స్ప‌ష్టం చేశారు. గ్రీన్‌ఛాలెంజ్‌లో భాగంగా రేవంత్‌రెడ్డి మంత్రి కేటీఆర్‌కు, చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డికి వైట్ చాలెంజ్ విసిరిన సంగ‌తి తెలిసిందే. దీనిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. అలాగే కొండా కూడా ఈరోజు మ‌ధ్యాహ్నం గ‌న్‌పార్క్ వ‌ద్ద‌కు వ‌స్తాన‌ని, ఉస్మానియాలో ప‌రీక్ష‌లు చేయించుకుందామ‌న్నారు. తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌లో న‌టులు, ద‌ర్శ‌కులు మాద‌క‌ద్ర‌వ్యాలు వాడుతున్నారంటూ వారిపై మ‌నీలాండ‌రింగ్ కోణంలో కూడా ఈడీ అధికారులు ద‌ర్యాప్తు జ‌రుపుతున్న సంగతి తెలిసిందే. ఎక్సైజ్ శాఖ జ‌రిపిన ద‌ర్యాప్తున‌కు, ఈడీ జ‌రిపే ద‌ర్యాప్తున‌కు తేడా ఉంద‌ని రేవంత్ ఆరోపిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న వీరిద్ద‌రికీ స‌వాల్ విసిరారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: