లోక‌ల్ వార్ : అండ్ ద విన్న‌ర్ ఈజ్ వైసీపీ!

RATNA KISHORE
స్థానిక ఎన్నిక‌లకు సంబంధించి తుది ఫ‌లితాల వెల్ల‌డి రాత్రి తొమ్మిదింటికి సాధ్య‌మ‌ని, లేదంటే అర్ధ‌రాత్రి దాటినా దాటొచ్చ‌ని పంచా య‌తీ రాజ్ క‌మిష‌న‌ర్ గిరిజా శంక‌ర్ తెలిపారు. సాయంత్రం సాయంత్రం ఆరు గంటల వరకు ఉన్న స‌మాచారం ప్ర‌కారం జెడ్పిటిసి 265 ఫలితాలు వచ్చాయి. వీటిలో అత్య‌ధికంగా 261 స్థానాల‌ను అధికార పార్టీ వైసీపీ, మూడింటిని టీడీపీ, ఒక్క స్థానాన్ని సీపీఎం గెలుచుకున్నాయ‌ని తెలిపారు. 7219 ఎంపీటీసీ స్థానాలకు 5745 స్థానాలకు ఫలితాలు వచ్చాయి అని, వీటిలో 4887 వైసీపీ కి, టీడీపీకి 627, జనసేన కు 61, బీజేపీకి 19, సీపీఎంకు 13, సీపీఐకు 7, కాంగ్రెస్ కు 7, ఇండిపెండెంట్ల‌కు 128 స్థానాల‌లో గెలుపు వ‌రించింది. చిత్తూరు, నెల్లూరు, క‌ర్నూలు జిల్లాల‌కు సంబంధించి పూర్తి స్థాయి ఫ‌లితాలు వ‌చ్చాయి అని, తడిసిన బ్యాలెట్ పత్రా లను పరిశీలిస్తున్నారు అని, చాలా తక్కువ మొత్తంలో తడిసిన బ్యాలెట్ లు ఉన్నాయి వాటి ప్రభావం పెద్దగా లేదు అని చెప్పా రు. అనంత‌పురం జిల్లా, మడకశిర మండ‌లంలో బ్యాలెట్ ప‌త్రాల‌కు చెద‌లు ప‌ట్ట‌డం వ‌ల్ల కౌంటింగ్ ఆల‌స్యమ‌వుతుంద‌ని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: