కేసీఆర్ హ‌యాంలో అన్ని పండ‌గ‌లు ప్ర‌తిష్టాత్మంగా నిర్వ‌హిస్తున్నారు : హోం మంత్రి

ఉదయం నుండే గణేష్ శోభాయాత్ర సజావుగా సాగుతుందని మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాదవ్ వెల్ల‌డించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నామ‌ని త‌ల‌సాని స్ప‌ష్టం చేశారు. అనుకున్న సమయానికే ఖైరతాబాద్ వినాయక నిమజ్జనం జరిగిందని మంత్రి స్ప‌ష్టం చేశారు. భక్తి శ్రద్ధలతో వినాయకుల నిమ్మజ్జనం చేస్తున్నారని త‌ల‌సాని చెప్పారు. ఇక హోం మంత్రి మ‌హ‌మూద్ అలీ మాట్లాడుతూ... తెలంగాణా రాష్ట్రం ఏర్పాటైన తరువాత అన్ని పండుగలను సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. 

హుసేన్ సాగర్ లో వినాయక విగ్ర‌హాల‌ను నిమజ్జనం చేయకూడదు అని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు కు వెళ్లి నిమజ్జనం కార్యక్రమం సజావుగా జరిగేలా చర్యలు తీసుకుంటోంద‌ని మ‌హ‌మూద్ అలీ వెల్ల‌డించారు. ఇదిలా ఉండ‌గా ఈ రోజు హైద‌రాబాద్ తో పాటు రాష్ట్ర వాప్తంగా ఉన్న న‌గ‌రాల్లో ప‌ట్ట‌ణాల్లో మరియు ప‌ల్లెల్లో గ‌ణేష్ నిమ‌జ్జ‌నం ఉత్స‌వాలు గ‌ణంగా జ‌రుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: