బాబు, లోకేష్ హైద‌రాబాద్‌లో ఉంటే మంచిది..!

Garikapati Rajesh

పంచాయతీ ఎన్నికల ఫలితాలకు మించి ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు వస్తున్నాయ‌ని,  ఇప్పటి వరకు కనీ విని ఎరుగని రీతిలో ప్రజలు వైకాపాకు ప్రజలు ఘనవిజయం కట్టబెట్టార‌ని మంత్రి అనిల్‌కుమార్ యాద‌వ్ అన్నారు.  సీఎం జగన్ పై నమ్మకం ,పరిపాలనపై ప్రజలు ఇస్తోన్న తీర్పుగా ఈ ఫలితాలను భావిస్తున్నామ‌ని,  ఘొరంగా ఒడిపోతామని ముందే తెలిసే ఒటమి పాలు కాకుండా తెదేపా పోటీ చేయకుండా  పారిపోయిందంటూ ఎద్దేశా చేశారు. ఇప్పుడేమో తెదేపా నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నార‌ని, రెండేళ్లు చేసిన సంక్షేమం,అభివృద్ది పథకాలకు ప్రజలిచ్చిన తీర్పున‌కు ఈ ఫలితాలు నిదర్శనమ‌ని,  ప్రభుత్వం, పాలనపై కొందరు విషం చిమ్మినా సంక్షేమంపై ప్రజలు తమదైన రీతిలో తీర్పు ఇచ్చార‌న్నారు.  చంద్రబాబు ,ఆయన తనయుడు హైదరాబాద్ కు పరిమితమైతే మంచిద‌ని హిత‌వు ప‌లికారు. 80 శాతం పైగా మున్సిపాల్టీలు, పంచాయతీల్లో 60శాతానికి పైగా ఎస్సీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎన్నికయ్యార‌ని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా సీఎం జగన్ వైపే ఉన్నార‌ని దీంతో తేలిపోయింద‌న్నారు. తెదేపాకు నామినేషన్ వేసేందుకూ అభ్యర్థులు లేక  గతి, దిక్కు లేక పోటీ చేయలేదు. పోలీసులను అడ్డు పెట్టుకుని చేశారంటూ తెదేపా వారు  అడ్డగోలుగా మాట్లాడుతున్నార‌ని మండిప‌డ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: