పంజాబ్ కొత్త ముఖ్యమంత్రి ఎవరు? రేసులో ఎవరెవరంటే?

Chaganti
పంజాబ్‌లో ముఖ్యమంత్రి పదవి నుండి కెప్టెన్ అమరీందర్ సింగ్‌ తప్పుకున్న తరువాత, తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అనేదే ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న. అమరీందర్ సింగ్ రాజీనామా తర్వాత, కొత్త ముఖ్యమంత్రి పేర్లకు సంబంధించిన ఊహాగానాలతో పంజాబ్ పొలిటికల్ సర్కిల్స్ వేడెక్కాయి. పంజాబ్ తదుపరి ముఖ్యమంత్రి ఎవరు? ఆ రేసులో ముందున్న వారు ఎవరు అనే వివరాల్లోకి వెళితే నవజ్యోత్ సింగ్, సునీల్ జాఖర్, మాజీ కేంద్ర మంత్రి అంబికా సోని లేదా రాష్ట్ర మంత్రి విజయ్ ఇందర్ సింగ్లా ముందు వరుసలో ఉన్నారని అంటున్నారు. అయితే, తుది నిర్ణయం సోనియా గాంధీ మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే కొత్త నాయకుడిని ఎన్నుకునేందుకు శాసనసభ పార్టీ సోనియా గాంధీకి అధికారం ఇచ్చింది. కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా తర్వాత రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరు? అనే దానికి సంబంధించి పార్టీ హైకమాండ్‌లో పెద్ద చర్చే జరుగుతోంది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పరిశీలకుడు కొత్త సిఎం పేరు నిర్ణయించే వరకు చండీగఢ్‌లో ఉంటారు. కొత్త ముఖ్యమంత్రి పేరుకు సంబంధించి న్యూఢిల్లీలోని రాహుల్ గాంధీ నివాసంలో ఒక ముఖ్యమైన సమావేశం కూడా జరిగిందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: