బ్రేకింగ్: ఏపీలో ఆల్ ఇండియా సర్వీసుల అధికారి అరెస్ట్...?

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తొలి కేంద్ర సర్వీస్ లో ఉన్న అధికారిని అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. ఫైబర్ నెట్ లో ఎం.డి గా ఉన్నపుడు టెర్రా సాఫ్ట్ వేర్ కంపెనీ కి అక్రమ కాంట్రాక్టు ఇచ్చారని ఆరోపణలతో ఐఆర్ఎస్ అధికారి కె.సాంబశివరావు ను అదుపులోకి తీసుకున్న సి.ఐ.డి పోలీసులు... విచారిస్తున్నారు. వైద్య పరీక్షల కోసం విజయవాడలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఆయన్ను.
గత 5 రోజులుగా సత్యనారాయణ పురం సిఐడీ కార్యాలయంలో ఆయనను అధికారులు విచారిస్తున్నారు. గత ప్రభుత్వ హయాం లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండీ గా ఆయన సేవలు అందించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి డిప్యుటేషన్ పై వచ్చి ఆంధ్రప్రదేశ్ లో ఆయన పని చేసారు. ఇప్పటికే సాంబశివరావు తో పాటు హరి ప్రసాద్ ను అధికారులు విచారించారు. సాంబశివరావు కు వైద్య పరీక్షలు అనంతరం సి.ఐ.డి కోర్టు లో హాజరు పరుస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: