నీళ్ళ గొడవ: కీలక అడుగు పడినట్టే...?

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం సంచలనం అయింది. ఈ జల వివాదానికి సంబంధించి తెలంగాణా కాస్త పట్టుదలగా వ్యవహరిస్తుంది. కేఆర్ఎంబీ& జిఆర్ఎంబీ సమావేశం కాసేపటి క్రితం ముగిసింది. ఉద్యోగులు, సిబ్బంది వివరాలను పది రోజుల్లోగా అందించాలని ఇరు రాష్ట్రాల అధికారులను కోరిన కృష్ణ బోర్డు సబ్ కమిటీ... - ఆపరేషన్స్, మెంటమెన్స్ కు సంబంధించి కోటి రూపాయలకు పైగా ఉన్న కాంట్రాక్ట్ ల వివరాలివాలని ఆదేశించింది.
సిఐఎస్ఎఫ్ భద్రత అంశాన్ని చివరగా చర్చిద్దామని ఉప సంఘం ఈ సందర్భంగా తెలిపింది. బనక చెర్ల హెడ్ రెగ్యులేటర్ బోర్డు పరిధిలోకి వద్దన్న ఏపీ, బోర్డు పరిధిలోనే ఉంచాలని తెలంగాణ ప్రభుత్వం కోరగా... తానే స్వయంగా వచ్చి అటువంటి అంశాలను పరిశీలిస్తా అని కన్వీనర్ పిళ్ళై తెలిపారు. ఈ అంశాలపై వచ్చే గురువారం మరోసారి బోర్డు మీటింగ్ ఉండే అవకాశం ఉందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap ts

సంబంధిత వార్తలు: