ఎమ్మెల్యే పై కేసులు ఎత్తేసిన ఏపీ పోలీసులు, హైకోర్ట్ లో పిటీషన్...?

ఆంధ్రప్రదేశ్ లో పోలీసులు తీసుకునే నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయి. సిఎం వైఎస్ జగన్ పై ఉన్న కేసులను ఎత్తేయడం పట్ల తీవ్ర విమర్శలు రాగా ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే పై ఉన్న కేసులను ఎత్తేయడం పట్ల కూడా విమర్శలు ఘాటుగా వస్తున్నాయి. జగ్గయ్య పేట ఎమ్మెల్యే సామినేని ఉదయభానుపై క్రిమినల్ కేసులు ఎత్తువేస్తూ ప్రభుత్వం తీసుకువచ్చిన జిఓపై హైకోర్టులో విచారణ జరిగింది.
ప్రభుత్వ జిఓ సవాల్ చేస్తూ హైకోర్టులో ఏపీజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు, పొలిటికల్ ఎనలిస్ట్ చెవుల కృష్ణంజనేయులు పిటీషన్ దాఖలు చేసారు. ఎమ్మెల్యేపై ఉన్న క్రిమినల్ కేసులు ఎత్తివేయడం చట్టవిరుద్దం అని అలాగే రాజ్యాంగ విరుద్ధమని పిటీషనర్ కోర్ట్ దృష్టికి తీసుకు వెళ్ళారు. పిటిషనర్ తరుపు వాదనలను న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ వినిపించారు. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది ఏపీ హైకోర్ట్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: