లీట‌రు పెట్రోల్ రూ.57?

Garikapati Rajesh

ఇప్ప‌టికే లీట‌రు పెట్రోలు, డీజిల్ ధ‌ర‌లు రూ.100 దాటి రూ.100 వ‌ర‌కు చేరుకుంటున్నాయి. కొండెక్కిన ధ‌ర‌ల‌ను త‌గ్గించాలంటే భార‌త ప్ర‌భుత్వం ముందు ఒక‌టే ప్ర‌త్యామ్నాయం ఉంది. వాటిని జీఎస్టీ ప‌రిధిలోకి తీసుకురావ‌డం. దీనివ‌ల్ల లీట‌రు పెట్రోలు కేవ‌లం రూ.57కే దొరుకుతుంది. స‌గానికి పైగా ధ‌ర‌లు త‌గ్గ‌నున్నాయి. శుక్ర‌వారం ల‌క్నోలో జీఎస్టీ మండ‌లి స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ఆర్థిక‌శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ అధ్య‌క్ష‌త‌న జ‌రిగే ఈ స‌మావేశంలో దీనిపై ఒక నిర్ణ‌యం తీసుకోనున్నారు. క‌రోనా కార‌ణంగా వ‌రుస‌గా రెండు సంవ‌త్స‌రాల‌పాటు జీఎస్టీ మండ‌లి స‌మావేశం వ‌ర్చువ‌ల్‌గానే జ‌రిగింది. శుక్ర‌వారం మాత్రం ప్ర‌త్య‌క్షంగా జ‌ర‌ప‌బోతున్నారు. మండ‌లిలో చ‌ర్చించిన‌దాన్నిబ‌ట్టి ఈరోజు సాయంత్రానికి ఒక స్ప‌ష్ట‌త రానుంది. పెట్రోలు, డీజిల్ ధ‌ర‌ల పెరుగుద‌ల‌పై ఇప్ప‌టికే దేశ‌వ్యాప్తంగా నిర‌స‌న పెల్లుబికుతోంది. దీనికితోడు వంట‌గ్యాస్ ధ‌ర‌ను కూడా పెంచారు. అంత‌ర్జాతీయ మార్కెట్లో ధ‌ర‌లు త‌క్కువ‌గా ఉన్న‌ప్ప‌టికీ కేంద్ర ప్ర‌భుత్వం కేవ‌లం ప‌న్నుల రూపంలోనే వ‌సూలుచేయ‌డంవ‌ల్ల ధ‌ర‌లు భారీగా పెరుగుతున్నాయ‌ని ప్ర‌జ‌లు మండిప‌డుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: