దేశంలో పెరుగుతున్న కేసులు?

Garikapati Rajesh

దేశంలో క‌రోనా కేసులు నెమ్మ‌దిగా పెరుగుతున్నాయి. వ‌రుస‌గా రెండోరోజు కూడా 30వేల‌కు పైగా కేసులు న‌మోద‌య్యాయి. కేంద్ర ఆరోగ్య‌శాఖ వివ‌రాల ప్ర‌కారం కేసుల సంఖ్య 34వేల‌కు చేరింది. 24 గంట‌ల వ్య‌వ‌ధిలో 34వేల‌కు పైగా కేసులు న‌మోదు కావ‌డం ఇటీవ‌లి కాలంలో ఇదే తొలిసారి. నిన్న ఒక్క‌రోజే దేశ‌వ్యాప్తంగా 320 మంది మృత్యువాత ప‌డ్డారు. ఇప్ప‌టివ‌ర‌కు 4.4 లక్ష‌ల మంది ఈ మ‌హ‌మ్మారికి బ‌ల‌య్యారు. మ‌నం క‌రోనా టీకా వేయించుకోవ‌డంతోపాటు మ‌న కుటుంబ స‌భ్యుల‌కు, స్నేహితుల‌కు, బంధువుల‌కు టీకా స్లాట్ బుక్‌చేసి ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీకి జ‌న్మ‌దిన కానుక ఇద్దామ‌ని ఆరోగ్య‌శాఖ మంత్రి మ‌న్‌సుఖ్ మండ‌వీయ పిలుపునిచ్చారు. టీకా వేయించుకొని ప్ర‌ధానికి కానుక ఇద్దామ‌ని, టీకా తీసుకోవ‌డంవ‌ల్ల యాంటీబాడీలు పెర‌గ‌డంతోపాటు క‌రోనా బారినుంచి ర‌క్షించుకోవ‌చ్చ‌న్నారు. ఆగ్నేయాసియా దేశాల్లో ఇప్ప‌టివ‌ర‌కు 100 కోట్ల క‌రోనా టీకాలు పంపిణీ జ‌రిగిన‌ట్లు ప్ర‌పంచ ఆరోగ్య‌సంస్థ ప్ర‌క‌టించింది. ఒక్క భార‌త‌దేశంలో 77కోట్ల డోసులు పంపిణీ అయ్యాయి. కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌, స్ఫుత్నిక్ మ‌న‌ద‌గ్గ‌ర అందుబాటులో ఉన్నాయి. మోడెర్నా, ఫైజ‌ర్ దేశంలో ప్ర‌వేశించ‌డానికి అనుమ‌తించాలంటూ ప్ర‌భుత్వానికి విన్న‌వించుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: