ఢిల్లీలో భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. ఆరుగురు పాక్ టెర్రరిస్టుల అరెస్ట్!

Chaganti
పాకిస్తాన్ నిధులు సమకూర్చిన టెర్రర్ మాడ్యూల్‌ని ఈరోజు దర్యాప్తు సంస్థలు ఛేదించాయి, ఈ కేసులో దర్యాప్తు సంస్థలు 6 మందిని అరెస్టు చేశాయి, అరెస్టయిన అనుమానితులు భారతదేశంలో ఒక టెర్రరిస్ట్ మాడ్యూల్‌ను నిర్వహిస్తున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం, ఈ పాకిస్తాన్ టెర్రరిస్ట్ మాడ్యూల్ కోసం పనిచేస్తున్న 6 మందిలో, ఇద్దరు పాకిస్తాన్‌లో శిక్షణ పొందారు, ఈ తీవ్రవాద మాడ్యూల్‌ను వెలికితీసేందుకు, ఏజెన్సీ ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర మరియు ఢిల్లీలో దాడులు నిర్వహించి మొత్తం 6 మందిని అరెస్టు చేసింది. ఈ అనుమానిత ఉగ్రవాదుల నుంచి పెద్ద మొత్తంలో ఆయుధాలు మరియు పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు ఏజెన్సీ పేర్కొంది, 


పాకిస్తాన్ ఆధారిత టెర్రర్ మాడ్యూల్ సభ్యులు ఇద్దరు పాకిస్థానీయుల ఆదేశాల మేరకు వ్యవహరిస్తున్నారు. నవరాత్రి మరియు ఇతర పండుగలలో తీవ్రవాద చర్యలకు పాల్పడటం వారి ఉద్దేశ్యం, ఇక వారి నుండి IED లు కూడా రికవరీ చేయబడ్డాయి, అరెస్టయిన టెర్రరిస్టుల వయస్సు 22 నుంచి 43 సంవత్సరాల వరకు ఉంటుంది. ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ స్పెషల్ సిపి, నీరజ్ ఠాకూర్ మాట్లాడుతూ, ఈ టెర్రరిస్ట్ మాడ్యూల్ యొక్క కనెక్షన్ డి కంపెనీ నుండి ఉంటుందని అనుకుంటున్నామని, ఈ టెర్రర్ మాడ్యూల్ ISI ఆధ్వర్యంలో పెద్ద కుట్ర పన్నిందని, అరెస్టయిన 6 మంది ఉగ్రవాదులలో, 2 మంది పాకిస్తాన్ నుంచి శిక్షణతో తిరిగి వచ్చారని పెర్కొన్నారు. 


ఇది ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ యొక్క బహుళ-రాష్ట్ర ఆపరేషన్ అని ఆయన పేర్కొన్నారు. స్పెషల్ సి పి నీరజ్ ఠాకూర్ ప్రకారం, ఈ టెర్రరిస్ట్ మాడ్యూల్ గురించిన సమాచారం నిఘా సంస్థల నుండి స్వీకరించబడింది, వారి నెట్‌వర్క్ అనేక రాష్ట్రాల్లో విస్తరించి ఉందని దర్యాప్తులో తేలింది. మహారాష్ట్రకు చెందిన ఉగ్రవాదిని కోటాలో అరెస్టు చేశారు. ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులు ఉత్తర్ ప్రదేశ్ ఏటీఎస్ సహాయంతో అరెస్టు చేయబడ్డారు. ఢిల్లీ నుంచి ఇద్దరు అనుమానితులను పట్టుకున్నారు. వీరిలో పాక్ లో శిక్షణ పొందిన ఇద్దరినీ ముందు మస్కట్‌కు తీసుకెళ్లారు. తర్వాత అక్కడి నుంచి వారిని పడవ ద్వారా పాకిస్థాన్‌కు తీసుకెళ్లారని తేలింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: