హిజ్రాల పించన్ లో మోసాలు: వైసీపీ ఎమ్మెల్యే కామెంట్స్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో నకిలీ పించన్ ల వ్యవహారం ఈ మధ్య కాలంలో సంచలనం అవుతుంది. నకిలీ పించన్ లకు సంబంధించి అధికారులే మోసం చేయడంతో ప్రభుత్వం దీని మీద సీరియస్ గా దృష్టి పెడుతుంది. అసలే ఆర్ధిక ఇబ్బందులు పడుతున్న సమయంలో ఈ విధంగా దోపిడీ లు చేయడం ప్రభుత్వానికి సవాల్ గా మారాయి అనే చెప్పాలి. తాజాగా మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే సంచలన వ్యాఖ్యలు చేసారు.
హిజ్రాల పేరుతో కలెక్టర్ ఆఫీస్ ఉద్యోగులు పించన్ లు దోచుకున్నారు అన్నారు. గత ఐదేళ్లుగా మా పించన్ లు దొచుకుంటున్నారని అన్నారు. హీజ్రాలు నా దృష్టికి తెచ్చారు అని తెలిపారు. హిజ్రా ల పించన్ లు పెద్ద స్కాం అని ఆయన ఆరోపించారు. దీనిపై విచారణ చేపట్టాలన్న ఎమ్మెల్యే ఆర్కే... దీనిపై వేగంగా ముందుకు వెళ్ళాలి అని విజ్ఞప్తి చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: