వైసీపీకే వినాయకుడు... జనసేనకు కాదా...?

రెండు తెలుగు రాష్ట్రాల్లో వినాయక నిమజ్జనం కాస్త సంచలనం అవుతుంది. వినాయక నిమజ్జనం విషయంలో వివాదాలు ఇప్పుడు ప్రభుత్వాలకు కూడా తలనొప్పిగా మారాయి. ఏపీలో వైసీపీ సర్కార్ చుట్టూ ఈ వివాదాలు తిరుగుతున్నాయి. తాజాగా గుంటూరు జిల్లాలో ఒక వ్యవహారం సంచలనం అయింది. మాచర్ల మండలం కొత్తపల్లి లో వినాయక నిమజ్జనం లో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
అనుమతి లేదని జనసేన మద్దతు దారుల ఊరేగింపును పోలీసులు అడ్డుకున్నారు. నిన్న వైసిపి వారి ఊరేగింపు కు అనుమతించింది మా ఊరేగింపు ఎందుకు అడ్జుకున్నారంటు ఆగ్రహం వ్యక్తం చేసారు. పోలీసుల తీరుకు నిరసనలు రోడ్డు పై బైఠాయించి ఆందోళనకు దిగారు ఆ పార్టీ కార్యకర్తలు. ఆందోళన చేస్తున్న వారిపైకి ఎద్దులు దూసుకోచ్చాయి. ఎద్దుల తొక్కిసలాటలో పలువురు కు గాయాలు కాగా వారిని ఆస్పత్రికి తరలించారు. ఊరేగింపు ప్రస్తుతం నడిరోడ్డు పై ఆగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: