కోచ్ సహాయం వద్దని గెలిచి చరిత్ర సృష్టించిన మానిక బాత్రా

Mamatha Reddy
 టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కి మొదటిరోజు పలు విభాగాల్లో మిశ్రమ ఫలితాలు లభించాయి. మానిక బాత్రా టేబుల్ టెన్నిస్ విభాగం లో మ్యాచ్ గెలిచి 1992 ఈ ఘనత సాధించిన తొలి మహిళగా చరిత్ర సృష్టించింది. మానిక బాత్రా  4-0 తేడాతో బ్రిటన్ కు చెందిన ఆరు తొంబై నాలుగో ర్యాంకర్ టిన్-టిన్ హొ పై విజయం సాధించింది. ఇక మానిక బాత్రా ర్యాంక్ 62 వ నెంబర్ కాగా,  ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మానిక బాత్రా పేరే వినిపిస్తోంది. దానికి గల కారణం ఆమె మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఆమె కౌచ్ సహాయం తీసుకోవడానికి నిరాకరించడమే. ఇక ఈ విజయం తనకు ఎంతో కొత్త ఉత్సహాన్ని ఇచ్చిందని మ్యాచ్ ముగిసిన తర్వాత మానిక బాత్రా ప్రకటించింది. కోచ్ సహాయం లేకుండానే ఆమె ఈ విజయాన్ని సొంతం చేసుకోవడం పట్ల పలువురు ఆసక్తికరంగా స్పందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: