టీఆరెస్ మహిళ ఎంపీ కి 6 నెలల జైలు శిక్ష

Mamatha Reddy
గత ఎన్నికల్లో జరిగిన కొన్ని అక్రమాలు టీఆర్ఎస్ ను వదిలేలా లేవు. ప్రస్తుతం మహబూబాబాద్ ఎంపీ కవిత కు ప్రజాప్రతినిధుల కోర్టు శిక్ష విధించింది. గత ఎన్నికల సమయంలో అక్రమంగా డబ్బు పంపిణీ చేశారనే కేసులో కవితకు జైలుశిక్షతో పాటు పది వేల రూపాయల జరిమానా విధించింది కోర్టు. 2019 ఎన్నికల ప్రచారం కోసం డబ్బు పంపిణీ చేశారని అభియోగం మోపబడింది. బుర్గి పహాడ్ పోలీస్ స్టేషన్ లో ఈ విషయం పై కేసు నమోదైంది. ఇక న్యాయస్థానం అభియోగాలను సమర్దించి కవితకు జైలుశిక్షతో పాటు పది వేల రూపాయలు జరిమానా విధించగా, ప్రస్తుతం కవిత బెయిల్ పై విడుదలయ్యారు. ఇక మాలోతు కవిత వ్యక్తిగత విషయాలకు వస్తే ఈమె ప్రముఖ మాజీ మంత్రి రెడ్యానాయక్ కుమార్తె. 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచి ప్రస్తుతం టీఆర్ఎస్ లో కొనసాగుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: