ఆమె పోరాటం ఒక స్ఫూర్తి: పవన్ కళ్యాణ్

ఒలంపిక్స్ లో భారత ఆటగాళ్ళు కాస్త దూకుడు ప్రదర్శిస్తున్నారు. పతకాల వేటలో కాస్త స్పీడ్ గా ముందుకు వెళ్తున్నారు. వెయిట్ లిఫ్టింగ్ లో మీరాబాయి చాను సిల్వర్ పతకం సాధించింది. దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. మీరాబాయి చాను విజయం దేశానికి గర్వకారణం అని అన్నారు ఆయన. టోక్యో ఒలింపిక్స్ లో మన దేశానికి తొలి పతకం అందించడం‌ అభినందనీయం అని తెలిపారు.
వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను కు నా తరపున, జనసేన పక్షాన హృదయపూర్వక అభినందనలు అని ఒక ప్రకటన విడుదల చేసారు పవన్. ఒలింపిక్స్ లో 20ఏళ్ల తరవాత వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో పతకం‌ సాధించారు  అని అన్నారు. కరణం మల్లీశ్వరి గారి తరవాత మీరాబాయి చాను ఈ రికార్డు సాధించడం గర్వ కారణం అని ఆయన అన్నారు. మణిపూర్ రాష్ట్రానికి చెందిన మీరాబాయి చాను అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన విధం, ఆమెలోని పోరాటపటిమ యువతకు స్ఫూర్తినిస్తాయి అని ఆయన కొనియాడారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: