బాంగ్లాదేశ్ కి మొట్టమొదటి ఇండియన్ రైల్వే ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్

Mamatha Reddy
ఇండియన్ రైల్వే మొట్ట మొదటి సారిగా 10 కంటైనర్లలో 200 ఎమ్‌టి లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ (ఎల్‌ఎంఓ) ను బంగ్లాదేశ్‌కు రవాణా చేస్తుంది. 10 కంటైనర్ల రేక్‌లో 200 మెట్రిక్ టన్నుల ఎల్‌ఎంఓను లోడ్ చేయడం పూర్తయింది అంటూ రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ట్వీట్ చేసింది. ఈ కంటైనర్లు ఆదివారం రోజు బంగ్లాదేశ్‌కు చేరవేయనుంద. దేశం హద్దులు దాటి ప్రాణాలను రక్షించే వాయువు ఆక్సిజన్ ని సప్లై చేయడం ఇదే మొదటిసారి. 10 కంటైనర్లతో కూడిన ఈ రైలు శనివారం జార్ఖండ్‌లోని తటానగర్ నుంచి బయలుదేరి ఆదివారం బంగ్లాదేశ్‌లోని బెనాపోల్‌కు చేరుకుంటుంది. 2021 ఏప్రిల్ 24 న కార్యకలాపాలు ప్రకటించినప్పటి రైల్వే ద్వారా ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 36,841 టన్నుల ద్రవ వైద్య ఆక్సిజన్‌ను తీసుకువెళ్లాయి. కరోనా రెండవ వెవ్ లో ఎంతో నష్టాన్ని చవి చూసింది ఆ సమయంలోనే ఈ ఆక్సిజన్ ట్యాంక్ లను తరలించే కార్యక్రమ చేపట్టింది రైల్వే.


 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: