బిగ్ బ్రేకింగ్ : దేశంలో సెప్టెంబ‌ర్ నుండి పిల్ల‌ల‌కు వ్యాక్సిన్.. !

దేశంలో కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ తక్కువలో తక్కువ ప్ర‌తి రోజు 30 వేలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు థ‌ర్డ్ వేవ్ హెచ్చరికలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా థ‌ర్డ్ వేవ్ ప్ర‌భావం చిన్న పిల్లల పైనే ఎక్కువ చూపిస్తోందని పలువురు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. దాంతో తల్లిదండ్రులు ఎంతో ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి తరుణంలో లో ఢిల్లీ ఎయిమ్స్ ఛీఫ్ ర‌ణ‌దీప్ గులేరియా ఒక శుభవార్త చెప్పారు. 

సెప్టెంబర్ నుండి దేశంలోని చిన్నారులకు కరోనా వ్యాక్సిన్ లు వేస్తామ‌ని ఆయ‌న‌ స్పష్టం చేశారు. ప్రస్తుతం మూడు సంస్థలలో ట్ర‌య‌ల్స్ కొనసాగుతున్నాయని ర‌ణ‌దీప్ గులేరియా అన్నారు. కొత్తగా పుట్టుకొచ్చే వేరియంట్ ల‌తోనే ప్రమాదం ఉండటంతో పెద్దవాళ్లకు బూస్ట‌ర్ డోస్ అవసరమని అభిప్రాయపడ్డారు. మనిషిలో రోగనిరోధక శక్తి తగ్గితే వేరియంట్ లు ప్రమాదకరంగా మారుతాయని స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: