సోమవారం ముఖ్యమంత్రిగా నితీశ్​కుమార్ ప్రమాణస్వీకారం..!

N.ANJI
బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్‌ కుమార్ వచ్చే వారంలో ప్రమాణస్వీకారం చేసే అవకాశముంది. సోమవారమే ఈ వేడుక ఉంటుందని జేడీయూ వర్గాలు వెల్లడించాయి. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించడంతో ముఖ్యమంత్రిగా నితీష్‌ కుమార్‌ మరోసారి బాధ్యతలు చేపట్టడం దాదాపు ఖాయమైంది. ఇక ఈ నెల 16న ‘భాయ్ దూజ్’ పండుగ సందర్భంగా నితీశ్ మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించనున్నారు.
కొత్తగా ఎన్నికైన ఎన్‌డిఎ ఎంఎల్‌ఏలు సమావేశమై తమ నాయకునిగా నితీష్‌ను లాంఛనంగా ఎన్నుకోవలసి ఉంటుంది. బీహార్ ముఖ్యమంత్రి పీఠంపై ఏర్పడిన సందిగ్ధతపై భారతీయ జనతా పార్టీ క్లారిటీ ఇచ్చింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయేకు స్పష్టమైన మెజారిటీ వచ్చినప్పటికీ ముఖ్యమంత్రి విషయంలో కొత్త సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీతో సహా బిజెపి అగ్రనాయకులందరూ ముఖ్యమంత్రిగా నితీష్ కొనసాగింపును ధ్రువీకరించడంతో వరుసగా నాలుగవసారి ఆయన ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టడంలో ఎటువంటి సందేహాలకు ఆస్కారం లేదు. బీజేపీ కన్నా తక్కువ స్థానాల్లో జేడీయూ గెలిచినప్పటికీ.. ముందే కుదిరిన అంగీకారం మేరకు నితీష్‌ కుమారే సీఎంగా ఉంటారని బీజేపీ స్పష్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: