తరాలు మారినా తగ్గని క్రేజ్ 'శివగామి'కే సొంతం

Vimalatha
సౌత్ సీనియర్ నటి రమ్య కృష్ణన్ ఈ రోజు 51ఏళ్లు పూర్తి చేసుకున్నారు. దశాబ్దాలు మారుతున్నా ఆమె క్రేజ్ మాత్రం మారడం లేదు. ఆమె తెలుగు , తమిళం , కన్నడ , మలయాళం మరియు హిందీ అనే ఐదు భాషలలో 260 కి పైగా చిత్రాలలో నటించింది. రమ్య నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, మూడు నంది అవార్డులు మరియు తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డును గెలుచుకుంది .
రమ్యకృష్ణ సినీ నటి, దర్శకుడు కృష్ణవంశీ ఈమె భర్త. ఈమె తమిళనాట పాత్రికేయుడు, విమర్శకుడు రామస్వామి మేనకోడలు. రమ్య కృష్ణన్ 15 సెప్టెంబర్ 1970 న చెన్నైలో జన్మించారు. 1990 నుండి 2000 వరకు దాదాపు దశాబ్ద కాలంపాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ సినిమాల్లో తన అసమాన నటనా ప్రతిభా పాటవాలతో ప్రేక్షకులను అలరించింది. యుక్తవయస్సులోనే సినిమా రంగంలో అడుగుపెట్టింది. 8వ తరగతి చదువుతున్నప్పుడే తమిళంలో ‘వెల్లై మనసు’లో ప్రధాన ప్రాత పోషించింది. 1987లో తెలుగులో ఆమె నటించిన మొదటి చిత్రం ‘బాల మిత్రులు’ రిలీజ్ అయ్యింది.  
1985లో వచ్చిన "భలే మిత్రులు" చిత్రంతో కథానాయికగా తెలుగు చిత్రరంగంలో ప్రవేశించి, 1989లో వచ్చిన "సూత్రధారులు" చిత్రం ద్వారా మంచినటిగా పేరు సంపాదించినప్పటికీ ఈమెకి చాలా కాలం వరకూ సరయిన అవకాశాలు రాలేదు. ఒకానొక దశలో రమ్యకృష్ణ ఐరన్ లెగ్ అన్న నమ్మకం కూడా చిత్రసీమలో ఉండేది. 1992లో విడుదలయిన "అల్లుడుగారు" చిత్రం ఈమె అదృష్టాన్ని మలుపు తిప్పింది. అప్పటి నుండి కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన అనేక సినిమాలలో ఈమె వరుసగా నటించగా, దాదాపు అవన్నీ విజయవంతమై రమ్యకృష్ణ నటిస్తే చాలు ఆ చిత్రం విజయం సాధిస్తుందని నిర్మాతలు నమ్మేవారు. దాదాపుగా తెలుగుహీరోలు అందరితోనూ ఆమెకు విజయవంతమైన సినిమాలున్నాయి.
"నరసింహ" చిత్రంలో రజినీకాంత్ తో పోటీపడి మరీ 'నీలాంబరి'గా అద్భుతం అన్పించింది. ఈ సినిమా సౌత్ తో పాటు సింగపూర్, లండన్, ఫ్రాన్స్, జపాన్ లాంటి అనేక దేశాల్లో విడుదలై అంతర్జాతీయంగా కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది. రమ్యకృష్ణ మంచి నటి మాత్రమే కాదు నృత్యకారిణి కూడా.. న్యూయార్క్, డల్లాస్ వేదికలపై నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. తెలుగు దర్శకుడు కృష్ణవంశీని 2003 జూన్ 12నపెళ్ళి చేసుకున్న రమ్యకృష్ణకు ఇద్దరు కుమారులు. వారిలో రిత్విక్ పేరుతో ఒక నిర్మాణ సంస్థ ప్రారంభించింది. ఇక 'శివగామి'గా ఆమె దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకుందన్న విషయం అందరికీ తెలిసిందే.





 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: