ముద్దుల కూతురికి ఆశ్చర్యకరమైన గిఫ్ట్ ఇచ్చిన సురేఖా వాణి...

SS Marvels
టాలీవుడ్ లో అక్క, వదిన క్యారెక్టర్లకు పెట్టింది పేరుగా సురేఖావాణి చాలా ఫేమస్. క్యారెక్టర్ ఏదైనా సరే తన అందం,అభినయంతో ఆ క్యారెక్టర్ కి నూటికి నూరు శాతం న్యాయం చేస్తుంది సురేఖ. కామెడీ పాత్రలయితే తిరుగే లేదు. తను సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటూ తెగ సందడి చేస్తుంటుంది.తన కూతురు సుప్రితతో కలిసి డాన్సులేస్తూ, వర్కవుట్లు చేస్తూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంటుంది. దీంతో సురేఖా వాణి సోషల్ మీడియా ఖాతాలకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. తన సోషల్ మీడియా ఖాతాలకు భారీగా పెరిగిన ఫాలోవర్లే తనకు గల క్రేజ్కు నిదర్శనం.




అయితే తన కూతురు సుప్రిత పట్ల ఎంతో ప్రేమగా ఉండే సురేఖా వాణి.. తాజాగా సుప్రిత పుట్టినరోజు సందర్భంగా చాలా ఘనంగా ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు ఆమెపై ఉన్న ప్రేమను తెలుపుతూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది. కూతురు సుప్రిత కోసం తన ప్రియ మిత్రులను ఇంటికి పిలిపించటం మాత్రమే కాకుండా తన రూమ్ ని స్పెషల్‌గా అలంకరించి, తనని కళ్లు మూసి ఆ రూమ్ వద్దకు తీసుకెళ్లి ఒక్కసారిగా చూపించింది. అయితే సుప్రిత ఆ గదిని చూసి, తక్కువ టైం లోనే ఆ గదిని డెకరేట్ చేసిన విధానానికి ఆశ్చర్యపోతుండగా అంతలోనే అక్కడ ఒక చిన్న కుక్క పిల్లను చూసేసరికి సుప్రిత ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఈ వీడియోని పోస్ట్ చేస్తూ ''నిన్నే పేమిస్తున్నా.. నువ్వే నా బలం, బలహీనత.. మీ డాడీ అక్కడి నుంచి చూస్తుంటాడు.. నీ వెంటే ఉంటాడు. గాడ్ బ్లెస్ యూ సుప్రిత లవ్లీ గాడు.. ఐ లవ్ యూ'' అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది సురేఖావాణి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: