వానాకాలంలో డ్రైస్కిన్ సమస్య తగ్గే టిప్స్!

Purushottham Vinay
ఇక వేసవి వేడి నుండి ఉపశమనాన్ని అందించే వర్షాకాలం అనేది రానే వచ్చింది. అయితే ఈ సీజన్‌లో వచ్చే వాతావరణ మార్పులు ఇంకా వర్షంలో అధికంగా తడవటం వంటి కారణాల వల్ల కొందరి ముఖ చర్మం తరచూ కూడా డ్రైగా మారిపోతుంటుంది.ఇంకా చర్మంలో తేమ తగ్గిపోవడం వల్ల అలా జరుగుతుంది. ఫలితంగా దురద, చికాకు ఇంకా వివిధ రకాల అలర్జీలు వంటి సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే డ్రై స్కిన్ సమస్యను ఈజీగా తగ్గించుకునేందుకు మార్కెట్లో లభించే రకరకాల క్రీములను వాడుతూ ఉంటారు.అయినప్పటికీ కూడా అసలు ఎలాంటి ఫలితం లేకా ఏం చేయాలో అర్థంగాక తెగ మదన పడిపోతూ ఉంటారు.ఇక ఈ లిస్ట్ లో మీరు ఉన్నారా.అయితే మీరు అస్సలు వర్రీ అవ్వకండి. ఎందుకంటే ఇక ఇప్పుడు చెప్పబోయే క్రీమ్‌ను ట్రై చేస్తే పొడి చర్మం సమస్యను చాలా సులభంగా వదిలించుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ క్రీమ్ ఏంటో.. దాన్ని ఇక ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.


ఇక ముందుగా ఒక కలబంద ఆకును తీసుకుని దాన్ని నీటిలో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ కలబంద ముక్కలను మిక్సీ జార్ లో వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుని జ్యూస్‌ను సపరేట్ చేసుకోవాలి. ఈ జ్యూస్‌లో రెండు టేబుల్ స్పూన్ల కార్న్‌ఫ్లోర్‌ను కూడా కలిపి చిక్కబడే వరకు ఉడికించి చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ ఫ్లెక్స్ సీడ్స్ జెల్, వన్ టేబుల్ స్పూన్ ఆముదం ఇంకా అలాగే రెండు చుక్కలు విటమిన్ ఇ ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే క్రీమ్ అనేది వెంటనే సిద్ధం అవుతుంది.ఇక ఈ క్రీమ్‌ను మీరు ఏదైనా బాక్స్‌లో నింపి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే వారం రోజుల పాటు చక్కగా యూస్ చేసుకోవచ్చు. ఈ క్రీమ్‌ను ముఖానికి బాగా అప్లై చేసుకుని చాలా సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. ఇలా రోజుకు రెండు సార్లు కనుక చేస్తే చర్మం తేమగా మారుతుంది. దాంతో డ్రై స్కిన్ సమస్య నుంచి మీరు చాలా ఈజీగా బయటపడొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: